Tuesday, July 12, 2011

ముక్కోతి కొమ్మచ్చి - అప్పుతచ్చులు .....ప్రింటర్ కి బుడుగ్గాడు ప్రైవేటు చెప్పేయటం ఖాయం


ఈ రోజు రమణ గారి ముక్కోతి కొమ్మచ్చి విడుదలైంది. ఆత్రంగా వెళ్లి తెచ్చుకుని రెండు మూడు గంటలు దాన్ని తనివితీరా చూసుకుని చదువుదామని తెరిచానో లేదో చిన్న ఝలక్.

రమణ గారే వెళ్ళిపోయి తొందరపడ్డారని బాధపడుతుంటే ముక్కోతి కొమ్మచ్చి ప్రింటర్ ఆయనకన్నా తొందరపడ్డాడు. పదహారో పేజీ తర్వాత ముప్పై రెండో పేజీ వరకు చివరాఖరి పేజీలు (117-131)  పెట్టేసి అనంతమైన రమణ గారి కబుర్లని ఆదిలోనే అంతానికి చేర్చేసాడు. మళ్ళీ పదహారు పేజీల తర్వాత నాలుక్కరుచుకుని  ముప్ఫై మూడో పేజీ నుంచీ చివరి పేజీ (131) వరకు వరసలో ఉంచాడు. అంటే ఈ సినిమాలో క్లైమాక్స్ పదహారో రీల్లోనే ఒక సారి చూపించేస్తాడన్నమాట. ఏదో ఒక పుస్తకం లో అంటే అనుకోచ్చు. మూడు పుస్తకాలు కొన్నా. మూడిటి కథా అంతే. ఈ తప్పు పబ్లిషర్స్ త్వరలోనే సవరించుకుంటారని ఆశిస్తున్నా. (అప్పుడు మళ్ళీ ఇంకో మూడు కొంటా. మొత్తం మూడు జతల సెట్లన్న మాట :)))) )





మరి పదిహేడు నుంచీ ముప్ఫై రెండో పేజీ వరకూనో అంటారా? .......అవి లేవనే కదా ఈ పోస్ట్ పెట్టింది. ఆ పేజీల్లో ఏముందో పబ్లిషర్లె చెప్పాలి. :)

4 comments:

సుజాత వేల్పూరి said...

ఈ మధ్య చాలా పుస్తకాలు ఇలాగే ఉంటున్నాయి. రమణ గారు ఉండుంటే ఈ పొరపాట్లకు ఆస్కారం చిక్కేది కాదు. పబ్లిషర్ సాక్షాత్తూ రమణగారి చేతే ముందే ప్రైవేట్ చెప్పించేసుకుని ఆ తర్వాత తప్పుల్లేకుండా పుస్తకం వేసేవాడు.

విశాలాంధ్ర వాళ్ళు వేసిన కొ.కు రచనల్లో కూడా ఇలా పేజీలకు పేజీలు ఖాళీగా కనిపిస్తాయి.(విరసం వాళ్ళు వేస్తున్న కొత్తవి హాయిగా ఉన్నాయి, ఒక్క తప్పూ లేకుండా)

ఇంతకీ మీ కాపీయే అలా ఉందా, అన్నీ అలాగే ఉన్నాయా? ముందే చెప్పారు నయం, కొనేప్పుడు కాస్త చెక్ చేసి కొనుక్కుంటా

బులుసు సుబ్రహ్మణ్యం said...

అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారో అర్ధం కాదు. ప్రింటర్ని, పబ్లిషర్ని బెంచీ ఎక్కించి నుంచో పెట్టించాలని డిమాండ్ చేస్తున్నాను.

తృష్ణ said...

అప్పుడే కొనేయటం చదివేయటం అయిపోయిందా..:((
ఇప్పుడు నేనెక్కాలేమో బెంచె మీద..!!

Indira said...

sanker garu namaste!i'm indira.i'm very much new here.i read almost all your posts.yours is very fine taste.srirangam gopalaratnaalu,emmeslu chittibabulu, viswanadha varu,mangalampalli varu, idigonarra,memandaram ikkada koluvu teeri unnam annattuga undi.annee download chesukunnanu.thanks for sharing.regards,Indira.

Post a Comment