Friday, February 25, 2011

జాటర్ ఢమాల్ ......వీడే బుడుగు...చిచ్చుల పిడుగు

ఇది నా బ్లాగు లో పరిచయం తరువాత మొదటి పోస్ట్. పరిచయం లో చెప్పినట్టుగానే ఈ బ్లాగ్ లో మొదటి పోస్ట్ గా ముళ్ళపూడి వెంకట రమణ గారి "బుడుగు"  ఈ బుక్ మీకు అందిస్తున్నాను. నిజానికి ఇది నా ఇంకో బ్లాగు "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే !!!!!!" లో గత ఫిబ్రవరిలో పోస్ట్ చేసి రమణ గారిని కలిసినప్పుడు ఆయనకి చూపించా. ఈ ఫిబ్రవరిలో మళ్ళీ దీనిని ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఆయనకి నివాళులర్పిస్తూ ఈ ఈ- పుస్తకం మీ కోసం.

బుడుగు గురించి మీకు పరిచయం చెయ్యడం అంటే ఆవకాయ గురించి తెలుగోడికి పరిచయం చేసినట్టే కాబట్టి నాకు బాపుబొమ్మ.కాం లో దొరికిన ఆ  బుడుగు  ఈ- బుక్ ని మీకు లింకుగా ఇస్తున్నా. ఆల్రెడీ చదివేశాం అంటారా. మళ్ళీ చదవండి...ఏం.. మాయా బజార్ మళ్ళీ వస్తే చూడట్లేదూ...ఇదీ అంతే!


(పోస్టు బావుందని చచ్చినట్టు ఒప్పుకోకపోతే మీ పని  జాటర్ ఢమాలే! అని బుడుగు చెప్పమన్నాడు )

8 comments:

Ennela said...

మీరు భయపెట్టకుండా ఉంటే...చాల బాగుంది అని చెప్దామనుకున్నా...ఇల్లా భయపెట్టేసారు కాబట్టీ..ఇంక తప్పట్లేదు...
టపా బాగుందీ...బుడుగు...గురించి చెప్పడానికేముందీ...చిచ్చల పిడుగు అని తప్పా!

తృష్ణ said...

Great effort andi. link lOki veLLi chadivaakaa mallI commentutaanu..:)

జ్యోతి said...

బోల్డు ధాంకులు. బుడుగును మా ఇంటికి తెచ్చేసుకుని దాచుకున్నాం.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మళ్ళీ ఏమిటి మళ్ళీ మళ్ళీ చదువుతాం. చదివిస్తాం. ధన్యవాదాలు.

..nagarjuna.. said...

>>ఏం.. మాయా బజార్ మళ్ళీ వస్తే చూడట్లేదూ...ఇదీ అంతే!

ఔ ఔ... :)

సుమలత said...

;)

Unknown said...

shankar gariki,buduguni maku parichayam chesinanadhuku chala santosham.paper lo chadavatame tappa nizamga budugu ami rasado telidu.google lo vethukutunte anukokunda mi link ki vachanu.budugu ni chaduvuthunantha sepu naku ado ananadham.inka anno vishayalu mi blog dwara telusukunnanu.ma ooru kakinadaki dagaralone.miru inka anno kaburlu maku chepalani asissthunnanu.valasa pakshulam memu,mi kadhalu chaduvuthu patha smruthulu gurthu techukuntu kalam gaduputhamu tirigi sontha gootiki chere varaku.vilayite vamsi gaari ma pasalapudi kadhalu kuda pettandi.
miru antho sahanam tho rasthunnantrdhuku dhanya vadhamulu.

Unknown said...

పోస్టు బావుందని చచ్చినట్టు ఒప్పుకోకపోతే మీ పని జాటర్ ఢమాలే! అని బుడుగు చెప్పమన్నాడు )budugu cheppaka oppukokapote assalu kudaradu. bavundi me presentation.
http:/kallurisailabala.blogspot.com

Post a Comment