Sunday, February 27, 2011

రమణ గారు గిరీశం తో చెప్పించిన లెక్చర్లు - ఓ సారి చదివేద్దురూ. లేకపోతే రమణగారు ఊర్కున్నా గిరీశం అసలు ఊర్కోడు

గిరీశం లెక్చర్లు - ఏమైనా చెప్పాలా ఈ పుస్తకం గురించి? అహ చెప్పాలా..అని అడుగుతున్నాను. రమణ గారి కలం లోని పదును, వ్యంగ్యం, మనసుకి కితకితలు పెట్టే హాస్యం, అక్కడక్కడ మనకి ఎక్కడో చురుక్కుమనేలా తన మార్కు సెటైర్లు మొత్తం మీద వేడి వేడి పకోడీల ప్లేటులా ఉంటుంది ఈ పుస్తకం. 

మల్లెపూలు.కాం సైట్ లో ఎప్పుడెప్పుడో దొరికిన ఈ పుస్తకాన్ని మీ చేతా చదివిన్చేద్దామని డిసైడయిపోయా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ  ఈ-బుక్ ఒక పాస్ వర్డ్ ఉంది. అదేంటో చెప్పాలంటే మీరు నాకు పన్నెండు, పదమూడు, పద్నాల్గు, పదిహేను చేగోడీలు ఇవ్వాలన్నమాట. ఇదిగో ఆ పుస్తకం లింక్ 


ఏంటి క్లిక్ చేసేసారా? మీకూ కుసింత కంగారేక్కువే. సర్లెండి ఎంతయినా మీరు నా ఫ్రెండులు కాబట్టి ఆ పాస్ వర్డ్ రహస్యం మీకు చెప్పేస్తా. చేగోడీలు పొట్లం కట్టించి తీరిగ్గా పంపిద్దురుగాని. 
పాస్ వర్డ్ : mallepoolu.com


అన్నట్టు మర్చిపోయా నా ఇంకో బ్లాగ్ లో (అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!) రమణ గారికి శతోపమాన నివాళి అందించా. ఒక సారి చూసి తిట్లు, చీవాట్లు, బిస్కత్తులు, చాక్లేత్తులు ఇచ్చేయండి.


3 comments:

తృష్ణ said...

డౌన్లోడ్ చేసేస్కుని, ఓ లుక్కేసేసి మరీ రాస్తున్నాను. చాలా థాంక్స్ అండి...అనటం చాలా తక్కేవేనండీ... మీరడిగినట్లు పదో పదిహేడో కాదు కానీ ఓ బండేడు ఇచ్చేస్తాలెండి. ఇలాగే మంచి మంచి టపాలు టపాయిస్తూ ఉండాలి మరి..!

ఆ.సౌమ్య said...

మీకు వేల వేల ధన్యవాదములు..ఈ పుస్తకం చదవాలని ఎప్పటినుండో అనుకుంటున్నా....ఇప్పుడు ఇలా చదివేసినా, అవకాశం వచ్చినప్పుడు కొనుక్కుని భద్రంగా దాచుకుంటాను.

kumar said...

Thanks for sharing the book.

Post a Comment