గిరీశం లెక్చర్లు - ఏమైనా చెప్పాలా ఈ పుస్తకం గురించి? అహ చెప్పాలా..అని అడుగుతున్నాను. రమణ గారి కలం లోని పదును, వ్యంగ్యం, మనసుకి కితకితలు పెట్టే హాస్యం, అక్కడక్కడ మనకి ఎక్కడో చురుక్కుమనేలా తన మార్కు సెటైర్లు మొత్తం మీద వేడి వేడి పకోడీల ప్లేటులా ఉంటుంది ఈ పుస్తకం.
మల్లెపూలు.కాం సైట్ లో ఎప్పుడెప్పుడో దొరికిన ఈ పుస్తకాన్ని మీ చేతా చదివిన్చేద్దామని డిసైడయిపోయా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ ఈ-బుక్ ఒక పాస్ వర్డ్ ఉంది. అదేంటో చెప్పాలంటే మీరు నాకు పన్నెండు, పదమూడు, పద్నాల్గు, పదిహేను చేగోడీలు ఇవ్వాలన్నమాట. ఇదిగో ఆ పుస్తకం లింక్
ఏంటి క్లిక్ చేసేసారా? మీకూ కుసింత కంగారేక్కువే. సర్లెండి ఎంతయినా మీరు నా ఫ్రెండులు కాబట్టి ఆ పాస్ వర్డ్ రహస్యం మీకు చెప్పేస్తా. చేగోడీలు పొట్లం కట్టించి తీరిగ్గా పంపిద్దురుగాని.
పాస్ వర్డ్ : mallepoolu.com
అన్నట్టు మర్చిపోయా నా ఇంకో బ్లాగ్ లో (అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!) రమణ గారికి శతోపమాన నివాళి అందించా. ఒక సారి చూసి తిట్లు, చీవాట్లు, బిస్కత్తులు, చాక్లేత్తులు ఇచ్చేయండి.
3 comments:
డౌన్లోడ్ చేసేస్కుని, ఓ లుక్కేసేసి మరీ రాస్తున్నాను. చాలా థాంక్స్ అండి...అనటం చాలా తక్కేవేనండీ... మీరడిగినట్లు పదో పదిహేడో కాదు కానీ ఓ బండేడు ఇచ్చేస్తాలెండి. ఇలాగే మంచి మంచి టపాలు టపాయిస్తూ ఉండాలి మరి..!
మీకు వేల వేల ధన్యవాదములు..ఈ పుస్తకం చదవాలని ఎప్పటినుండో అనుకుంటున్నా....ఇప్పుడు ఇలా చదివేసినా, అవకాశం వచ్చినప్పుడు కొనుక్కుని భద్రంగా దాచుకుంటాను.
Thanks for sharing the book.
Post a Comment