Sunday, February 27, 2011

రమణ గారు గిరీశం తో చెప్పించిన లెక్చర్లు - ఓ సారి చదివేద్దురూ. లేకపోతే రమణగారు ఊర్కున్నా గిరీశం అసలు ఊర్కోడు

గిరీశం లెక్చర్లు - ఏమైనా చెప్పాలా ఈ పుస్తకం గురించి? అహ చెప్పాలా..అని అడుగుతున్నాను. రమణ గారి కలం లోని పదును, వ్యంగ్యం, మనసుకి కితకితలు పెట్టే హాస్యం, అక్కడక్కడ మనకి ఎక్కడో చురుక్కుమనేలా తన మార్కు సెటైర్లు మొత్తం మీద వేడి వేడి పకోడీల ప్లేటులా ఉంటుంది ఈ పుస్తకం. 

మల్లెపూలు.కాం సైట్ లో ఎప్పుడెప్పుడో దొరికిన ఈ పుస్తకాన్ని మీ చేతా చదివిన్చేద్దామని డిసైడయిపోయా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ  ఈ-బుక్ ఒక పాస్ వర్డ్ ఉంది. అదేంటో చెప్పాలంటే మీరు నాకు పన్నెండు, పదమూడు, పద్నాల్గు, పదిహేను చేగోడీలు ఇవ్వాలన్నమాట. ఇదిగో ఆ పుస్తకం లింక్ 


ఏంటి క్లిక్ చేసేసారా? మీకూ కుసింత కంగారేక్కువే. సర్లెండి ఎంతయినా మీరు నా ఫ్రెండులు కాబట్టి ఆ పాస్ వర్డ్ రహస్యం మీకు చెప్పేస్తా. చేగోడీలు పొట్లం కట్టించి తీరిగ్గా పంపిద్దురుగాని. 
పాస్ వర్డ్ : mallepoolu.com


అన్నట్టు మర్చిపోయా నా ఇంకో బ్లాగ్ లో (అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!) రమణ గారికి శతోపమాన నివాళి అందించా. ఒక సారి చూసి తిట్లు, చీవాట్లు, బిస్కత్తులు, చాక్లేత్తులు ఇచ్చేయండి.


Friday, February 25, 2011

జాటర్ ఢమాల్ ......వీడే బుడుగు...చిచ్చుల పిడుగు

ఇది నా బ్లాగు లో పరిచయం తరువాత మొదటి పోస్ట్. పరిచయం లో చెప్పినట్టుగానే ఈ బ్లాగ్ లో మొదటి పోస్ట్ గా ముళ్ళపూడి వెంకట రమణ గారి "బుడుగు"  ఈ బుక్ మీకు అందిస్తున్నాను. నిజానికి ఇది నా ఇంకో బ్లాగు "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే !!!!!!" లో గత ఫిబ్రవరిలో పోస్ట్ చేసి రమణ గారిని కలిసినప్పుడు ఆయనకి చూపించా. ఈ ఫిబ్రవరిలో మళ్ళీ దీనిని ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఆయనకి నివాళులర్పిస్తూ ఈ ఈ- పుస్తకం మీ కోసం.

బుడుగు గురించి మీకు పరిచయం చెయ్యడం అంటే ఆవకాయ గురించి తెలుగోడికి పరిచయం చేసినట్టే కాబట్టి నాకు బాపుబొమ్మ.కాం లో దొరికిన ఆ  బుడుగు  ఈ- బుక్ ని మీకు లింకుగా ఇస్తున్నా. ఆల్రెడీ చదివేశాం అంటారా. మళ్ళీ చదవండి...ఏం.. మాయా బజార్ మళ్ళీ వస్తే చూడట్లేదూ...ఇదీ అంతే!


(పోస్టు బావుందని చచ్చినట్టు ఒప్పుకోకపోతే మీ పని  జాటర్ ఢమాలే! అని బుడుగు చెప్పమన్నాడు )

జాటర్ ఢమాల్ - ఈ బ్లాగ్ నా ఆరాధ్య దైవం (మీరు కరెక్ట్ గానే చదివారు) ముళ్ళపూడి వెంకట రమణ గారికి అంకితం

ఈ బ్లాగ్ లో నాకు చాలా చాలా ఇష్టమైన రమణ గారి జ్ఞాపకాలు ,  పేరడీలు, నా దగ్గర ఉన్న ౩౦౦౦ INTERNATIONAL TELEVISION COMMERCIALS COLLECTION (అదేనండీ టీవీ యాడ్లు వీటిని త్వరలో పదివేలకి చేర్చేస్తా ...హ.. హ.. హ ), నా వాటా కూడా ఉన్న ఇండియన్ యాడ్ లు (అంటే అచ్చం గా మా టీం చేసిన యాడ్ లు అన్నమాట), అప్పుడప్పుడు నా సొంత కపిత్వం జల్లుతూ ఉంచదలిచాను.